Share News

అమ్రాబాద్‌ అభయారణ్యంలో మంటలు

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:34 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని, నల్లమల అమ్రాబాద్‌ అభయారణ్యంలో మంటలు చెలరేగా యి.

అమ్రాబాద్‌ అభయారణ్యంలో మంటలు
బ్లోయర్లతో మంటలు ఆర్పుతున్న ఫైర్‌ వాచర్లు

- 70 హెక్టార్లలో తగులబడిన అడవి

దోమలపెంట, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని, నల్లమల అమ్రాబాద్‌ అభయారణ్యంలో మంటలు చెలరేగా యి. దోమలపెంట రేంజ్‌ పరిధిలోని తాటిగుండాల సెక్షన్‌లో దూబోడు నార్త్‌ బీట్‌ తునికిమాన్‌ పెంట ప్రాంతంలో కంపార్ట్‌మెంట్‌ 181, 182లలో శుక్ర, శనివారాల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 70 హెక్టార్ల విస్తీర్ణం వరకు అటవీ తగులబడింది. అటవీశాఖ అధికారులు, టైగర్‌ ట్రాకర్లు, ఫైర్‌ వాచర్లు 15 మందికి పైగా సిబ్బంది మంటలను ఆర్పేందుకు రెండు రోజుల పాటు అడవిలోనే ఉండాల్సి వచ్చిందని దోమలపెంట రేంజర్‌ గు రుప్రసాద్‌ తెలిపారు. శనివారం రాత్రి వరకు అదుపులోకి వచ్చాయని చె ప్పారు. పునరావృతం కాకుండా పెట్రోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఉద్ధేశ పూర్వకంగా నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Feb 09 , 2025 | 11:34 PM