ఆర్థిక అక్షరాస్యత.. ఐశ్వర్యానికి బాట
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:27 PM
ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట వేస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట వేస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షర్యాసత వారోత్సవాలు ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహిస్తామన్నారు. వారోత్సవాలకు సంబంధించి ఆర్‌బీఐ ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. కార్యక్రమా న్నుద్ధేశించి లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జీతాలు తీసుకునే వారు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు సురక్షితమైన పొదుపు మార్గాలను ఎంచుకొని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.