ఫీరోజ్‌గాంధీ ముస్లిం కాదు : మల్లురవి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:48 PM
ఫీరోజ్ గాంధీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని, దీంతో రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ కూడా ముస్లిం మతస్థులని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి మండిపడ్డారు.

ఎర్రవల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఫీరోజ్ గాంధీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని, దీంతో రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ కూడా ముస్లిం మతస్థులని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామికి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందించారు. పీఎసీఎస్ చైర్మన్‌ల పదవీ కాలం ఆరు నెలల పాటు పొడిగించడంతో గద్వాల, వనపర్తి పీఎసీఎస్‌ల అధ్యక్షులు ఎంపీని సన్మానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిరోజ్ గాంధీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కాదని, పార్సి మతస్థుడని అయన అంత్యక్రియలు కూడా అదే మత సంప్రదాయంగా జరిగాయన్నారు. అర్థరహిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే ఆ మతానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షులు రంగారెడ్డి, గౌనిబుచ్చారెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.