Share News

చోరీ కేసులో తండ్రీకొడుకుల అరెస్ట్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:58 PM

బైక్‌పై వస్తున్న వ్యక్తితో మాటకలిపి రూ. లక్ష నగదును కాజేసిన తండ్రి, కొడుకును అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపా రు.

చోరీ కేసులో తండ్రీకొడుకుల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

- విలేకర్ల సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): బైక్‌పై వస్తున్న వ్యక్తితో మాటకలిపి రూ. లక్ష నగదును కాజేసిన తండ్రి, కొడుకును అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపా రు. గురువారం గద్వాల పట్ట ణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న శాంతినగర్‌లోని మానవపాడు మండలం మద్దూర్‌ గ్రామానికి చెందిన బాలాసాహెబ్‌ శాంతినగర్‌లోని యూనియన్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకోవడానికి లక్ష నగదుతో బైక్‌పై బ్యాంకు కు వెళ్లాడు. బ్యాంకు అధికారులు టెక్నికల్‌ సమస్య ఉందని చెప్పడంతో డబ్బులతో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి అడ్రస్‌ అడుగుతూ.. మరో వ్యక్తి వ చ్చి తన బైక్‌ కవరులో ఉన్న లక్ష నగదు తీసుకొని బైక్‌పై పారిపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, ఎస్‌ఐ సంతో ష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో గురువారం మద్దూరు స్టేజీ సమీపంలో ఆ ఇదరిని అరెస్ట్‌ చేసి విచారించారు. బాలాసాహెబ్‌ డబ్బులు ఎత్తుకెళ్లింది వారే అని, ఇద్దరు తండ్రీ కొడుకులని, ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బిట్రగుంట గ్రామానికి చెందిన వారుగా గుర్తిం చారు. తండ్రి పిట్ల శివకుమార్‌, అయన కుమారుడి (మైనర్‌) పై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూ పిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్బీ ిసీఐ నాగేశ్వర్‌రెడ్డి, శాంతినగర్‌ ఎస్‌ఐ సంతోష్‌ ఉన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:58 PM