Share News

ప్రాణం తీసిన ప్రమాదం

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:45 PM

రో డ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిం పింది. తెల్లవారుజామున మసక వెలుతురులో జరిగిన ప్రమాదంలో అన్న మరణించగా, తమ్ముడు ప్రాణాపా యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు...

ప్రాణం తీసిన ప్రమాదం

- అన్న మృతి.. అపస్మారక స్థితిలో తమ్ముడు ఫ తల్లడిల్లిన కుటుంబం

మహబూబ్‌నగ ర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రో డ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిం పింది. తెల్లవారుజామున మసక వెలుతురులో జరిగిన ప్రమాదంలో అన్న మరణించగా, తమ్ముడు ప్రాణాపా యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు... శుక్రవారం తెల్లవారుజామున మన్యంకొండ స్టేజీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంతో గ్రామంలో విషాదచాయలు అలు ముకున్నాయి. మహబూబ్‌నగర్‌ మండలం పోతన్‌పల్లి కి చెందిన వెంకటయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అంజి, కేశ వులు అన్నదమ్ములు. కేశవులు గుంటూరులో పశువుల కాపరిగా పనిచేస్తుండగా, అ న్న అంజి(22) గ్రామంలోనే వ్యవసాయ పనులు చే స్తున్నాడు. మూడ్రోజుల క్రితం ఊరికి వచ్చిన కేశవులు శుక్రవారం తిరిగి గుంటూరు వెళ్లేందుకు పయనమ య్యాడు. పాలమూరులో తెల్లవారుజామున ముంబ యి బస్సు ఉండటంతో ఉదయం 5 గంటలకు అంజి ద్విచక్రవాహనంపై తమ్ముడిని బస్సు ఎక్కించేందుకు పోతన్‌పల్లినుంచి బయలుదేరారు. రోడ్డుపైకి వచ్చి కొం తదూరం రాగానే మ న్యంకొండ స్టేజీ దగ్గ ర గుర్తు తెలియని వాహనం వీరి వాహ నాన్ని ఢీకొట్టి వెళ్లిపో యింది. ఈ ప్రమా దంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యా యి. అదే సమయం లో మక్తల్‌నుంచి హై దరాబాద్‌ వెళుతున్న మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించాడు. వెంటనే దిగి 108 ఆంబులెన్స్‌ సమాచారం అందించారు. అంబులె న్స్‌ వచ్చే వరకు అక్కడే ఉండి క్షతగాత్రులను ఎక్కిం చేందుకు సాయం పట్టాడు. వాళ్లు వెళ్లిపోయాక ఎమ్మె ల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే క్షతగాత్రుల ను ఆసుపత్రికి తరలిస్తుండగానే అంజి మార్గమధ్యం లోనే చనిపోయాడు. కేశవులు ఎస్‌వీఎస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు కొడుకులలో ఓ కొడు కు చనిపోవడం, మరో కొడుకు ప్రాణాపాయస్థితిలో కొ ట్టుమిట్లాడుతుండటంతో కుటుంబం తల్లడిల్లింది. తం డ్రి వెంకటయ్య రూరల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:45 PM