Share News

వేగంగా వసూలు

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:04 AM

మహబూబ్‌నగర్‌ జి ల్లాలోని 423 గ్రామ పంచాయతీల్లో పన్ను ల వసూలు కార్యక్రమం వేగవంతంగా కొ నసాగుతున్నది.

వేగంగా వసూలు
పెద్దాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

- 80 శాతం పన్నుల రికవరీ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్య్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జి ల్లాలోని 423 గ్రామ పంచాయతీల్లో పన్ను ల వసూలు కార్యక్రమం వేగవంతంగా కొ నసాగుతున్నది. ఈ ఏడాది గ్రామ పంచా యతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించడంతో పంచాయతీ కార్య దర్శులు పన్నుల వసూలుపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పవచ్చు. బీసీ కులగణన తర్వాతనే ఎన్నికలు ని ర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నది. దీంతో గురువారం నాటికి గ్రామ పం చాయతీల్లో పన్నులు 80శాతం వసూలు అయినట్లుగా ఆన్‌లైన్‌లో వివరాలు గ్రామా ల వారిగా నమోదు ఆయ్యాయి. నేటి సా యంత్రం వరకు పన్నుల వసూలు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొ త్తం పన్నుల డి మాండ్‌ 7,10, 74,604 ఉండగా నేటికీ 5,66,21,243 వ సూలు అయ్యాయి. ఇంకా రావాల్సిన బకా యిలు 1,44,53, 361 ఉండగా వాటిలో నేటి సాయంత్రం వరకు మరో 5శాతం పన్నులు వసూలయ్యేలా ఉన్నాయి. వాటి వివరాలు సా యంత్రంలోగా ఆ న్‌లైన్‌లో నమోదు అవు తాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ మండలంలో 93 శాతం, హన్వాడ మండ లంలో 92శాతం పన్నులు పంచాయతీ కా ర్యదర్శులు సేకరించారు. అత్యల్పంగా జడ్చర్ల మండలంలో 56 శాతం మాత్రమే వసూలు అయ్యాయి.

ఎన్నికలు ఆలస్యం కావడంతోనే వేగం

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నేడో రేపో నోటిఫికేషన్‌ వెలువడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ నుంచి రోజూ ఆదేశాలు వస్తుండటంతో ఆధికారులు తమ దృష్టినంతా దానిపైనే పెట్టారు. ఓటరు జాబితా తయారుతో పాటు, ప్రదర్శన, బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌, ఎన్నికల సామగ్రి మండలాలకు పంపిణీ తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. తీరా ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో అధికారులు పన్నుల వసూలుపై దృష్టి సారించారు. దీంతో గత నెలలో 33శాతం వసూలు అయిన పన్నులు నేడు 80శాతానికి చేరుకున్నాయి.

మార్చి రెండో వారంలోగా 100శాతం వసూలు చేస్తాం

గ్రామ పంచాయతీ ఎ న్నికల నిర్వహణ, ప్రభు త్వ సర్వేలతో బి జీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిర్వహణ బీసీ కులగనణ తర్వతే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ డంతో పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ మండలంలో 93శాతం, హన్వాడ మండలంలో 92 శాతం పన్నులు వసూలు అయ్యాయి. పన్నుల వసూళ్లలో వెనకబడ్డ మండలాల్లో దృష్టి సారిస్తాం. మార్చి రెండో వారంలోగా 100 శాతం పన్నులు వసూలు చేస్తాం.

- పార్థసారథి, డీపీవో, మహబూబ్‌నగర్‌

Updated Date - Feb 28 , 2025 | 12:04 AM