Share News

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:45 PM

ఎమ్మె ల్యేను మూడు గ్రామాల ప్రజలు పూలబోకే ఇ చ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

గద్వాలన్యూటౌన్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల యంలో సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతుల మీదుగా సోంపురం, యర్సన్‌దొడ్డి, సుల్తానాపురం గ్రామాల ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే ద్వారా 11 కే.వి సబ్‌స్టేషన్‌ ప్రొసీడింగ్‌లు అందుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మె ల్యేను మూడు గ్రామాల ప్రజలు పూలబోకే ఇ చ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. కే.టి.దొడ్డి మండలంలోని సోంపురంలో 11 కే.వి. సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వం తో మాట్లాడి గ్రామానికి మంజూరు చేయించడంతో వారు ఆనందం వ్యక్తంచేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సోంపురం, యర్సన్‌దొడ్డి, సుల్తానాపురం గ్రామస్థులు, రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఉపముఖ్యమంత్రి మల్లు బట్టిమార్క, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 17 , 2025 | 11:45 PM