రైతులకు లబ్ధి జరిగేలా చూడాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:25 PM
సాగుకు యోగ్యమైన భూమి ఉన్న రైతులందరికి లబ్ధి జరిగేలా సర్వే నిర్వహించాలని ఊట్కూర్ తహ సీల్దార్ చింత రవి అన్నారు.

- తహసీల్దార్ చింత రవి
- ఊట్కూర్ మండలంలో వ్యవసాయ భూముల సర్వే
ఊట్కూర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సాగుకు యోగ్యమైన భూమి ఉన్న రైతులందరికి లబ్ధి జరిగేలా సర్వే నిర్వహించాలని ఊట్కూర్ తహ సీల్దార్ చింత రవి అన్నారు. రైతు భరోసా ఇవ్వడానికి సాగుకు యోగ్యమైన భూముల సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని చిన్నపొర్ల, ఎడవెల్లి, మల్లెపల్లి, సామనూర్, లక్ష్మీపూర్, భాపూర్, ఊట్కూర్, వల్లంపల్లి, ఎర్గట్‌పల్లి, పులిమామిడి, దం తన్‌పల్లి గ్రామాల్లోని శివార్లలో అధికారులు వ్యవసాయ భూముల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఊట్కూర్, వల్లంపల్లి గ్రా మాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ సర్వేలో సాగు చేసే నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చూడాలన్నారు. సర్వేలో సీనియర్ అసిస్టెంట్ రాఘవేందర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకటేష్, సర్వే అధికారులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన ప్రత్యేక అధికారి
ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తి, లక్ష్మీపల్లి గ్రామాల్లో జరుగుతున్న నూతన రేషన్ కార్డుల సర్వేను శుక్రవారం మండల ప్రత్యేక అధికారి ఉ మాపతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. ఎవరికీ అన్యాయం జరగ కుండా సర్వేను నిర్వహించాలన్నారు. అనేక సంవత్సరాలుగా జనాలు రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నారని, వారికి ఆదాయం, ఇతర విషయాలను తెలిపి సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్, పంచాయతీ కార్యద ర్శులు పాల్గొన్నారు.
ఇంటింటి సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి
నర్వ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటింటి సర్వేను పకడ్బందీగా నమోదు చేయాలని పీఆర్ ఈఈ, మండల ప్రత్యేక అధికారి హీర్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండల కేంద్రంతో పాటు, రాయికోడ్, నర్వ, కల్వాల్, కొత్తపల్లె, యాంకి గ్రామాల్లో జ రుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నాలుగు టీముల ద్వారా సర్వే జ రుగుతోందన్నారు. ఆయా గ్రామాల్లో తహసీల్దార్ మల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో అఖిలారెడ్డి, ఆర్‌ఐ మల్లేష్, ఎంపీవో రాఘవేందర్, అధి కారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటి సర్వేలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రధానంగా అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్‌కు సంబంధించిన నివాసాలను పరిశీలించి అగ్రికల్చర్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న భూముల వివరాలను గుర్తి స్తున్నామని, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లేని వారిని పరిశీలన చేస్తున్నామన్నారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో మండల సర్వేయర్ రంగయ్య, పంచాయతీ కార్యదర్శులు బుచ్చిరెడ్డి, రాజబాబు, ర మేష్, కతలప్ప, రెవెన్యూ సిబ్బంది బాల్‌రాజ్ తదితరులున్నారు.