Share News

సాగు చేస్తున్న ప్రతీ ఎకరాకు రైతు భరోసా

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:00 AM

రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతీ ఎకరాకు రైతు భరోసా రూ.12వేలు అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

సాగు చేస్తున్న ప్రతీ ఎకరాకు రైతు భరోసా
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

-ఎకరాకు రూ 12వేల రైతు భరోసా

-ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతీ ఎకరాకు రైతు భరోసా రూ.12వేలు అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నియో జకవర్గ ప్రజల తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రాష్ట్రం లో సాగుచేస్తున్న ప్రతీ ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి అయ్యిందని, త్వరలో పునాదులు వేస్తామన్నారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వ కాంగ్రెస్‌ ప్రభుత్వం అని తెలిపారు. ఎకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లేష్‌, లక్ష్మీనరసింహ, రాములు, గోపాల్‌రెడ్డి, రామనాథం, అనంతరెడ్డి, నాయకులు ఉన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:00 AM