Share News

అంతర్గత మార్కుల నమోదు పరిశీలన

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:29 PM

మార్చి 22 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో అంతర్గత మా ర్కుల నమోదు జిల్లాలో సోమవారం ప్రారంభమైంది.

అంతర్గత మార్కుల నమోదు పరిశీలన
పేట వైదిక్‌ పాఠశాలలో అంతర్గత మార్కులను పరిశీలిస్తున్న అధికారులు

నారాయణపేట/కోస్గి రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మార్చి 22 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో అంతర్గత మా ర్కుల నమోదు జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్రాల్లో ప్రతీ సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున నమోదు పరిశీలన చేస్తున్నారు. ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌ మార్కుల నమోదును చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన బృందాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. సోమవారం నారాయణపేటలోని నారాయణ స్కూల్‌, వైదిక్‌ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా మార్కులను పరిశీలించారు. కార్యక్రమం లో అంతర్గత నమోదు బృందం అధికారులు భారతి, భానుప్రకాష్‌ తదితరులున్నారు. అదేవిధంగా, కోస్గి మండంలోని మీర్జాపూర్‌ ఉన్నత పాఠశాలను సోమవారం పదో తరగతి ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన బృందం సందర్శించింది. బృందం అధికారి కృష్ణగౌడ్‌ ఆధ్వర్యంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు కేటాయించిన మార్కులను, నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని హెచ్‌ఎం వెంకట్రామరెడ్డి తెలిపారు. పరిశీలకులు ఉమామహేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయులు సిద్దిరాములు, త్రిగుణ, మల్లేశం, భీమయ్య ఉన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:29 PM