విగ్రహాలకు మండప ప్రవేశ పూజలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:29 PM
మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సోమవారం నుంచి గురువారం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

కొత్తపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సోమవారం నుంచి గురువారం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఆలయంలో గణపతి పూజతో పాటు విశేష పూజలు నిర్వహించారు. విగ్రహాలకు మండప ప్రవేశ పూజలు చేశారు. మంగళవారం కూడా విశేష పూజలు నిర్వహిం చి, బుధవారం విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నాయ కులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.