Share News

బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:47 PM

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరమే రాష్ట్రం లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ యు గంధర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు

బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ యుగంధర్‌ గౌడ్‌

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కులగణన రిపోర్టును సమీక్షించి కా మారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరమే రాష్ట్రం లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ యు గంధర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. బీసీల రిజర్వే షన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలన్నారు. అ సెంబ్లీలో ఆమోదించిన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం గద్వాలకు వ చ్చిన యుగంధర్‌గౌడ్‌ పట్టణంలోని బీసీ నాయ కుడు రవీంద్రగౌడ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం ఏర్పా టు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికపై బీసీ సమాజం ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, అలాంటి దుస్థితి పునరా వృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి చట్టబద్ధత లభించిన అనంతరమే ఎన్నికల షె డ్యూల్‌ విడుదల చేయాలన్నారు. కాగా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జనరల్‌ స్థానాల్లో సైతం బీసీ అభ్యర్థులను బరిలోకి దించుతా మన్నారు. బీసీ నాయకులు పార్టీల వారీగా విడి పోకుండా బీసీ అభ్యర్థులు కచ్చితంగా గెలిచేలా వ్యూహాత్మక ఎత్తుగడలు అనుసరించాలన్నారు. రాజ్యాధికారానికి మూలం స్థానిక సంస్థల్లో గె లుపే అన్న వాస్తవాన్ని బీసీ నేతలందరూ గు ర్తించాలన్నారు. బీసీల మధ్య విబేధాలు సృష్టిం చి రాజకీయ లబ్ధి పొందేందుకు అగ్రకుల నేత లు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. జిల్లాలో బీసీలంతా ఐక్యంగా ఉండి గద్వాల కోటపై బీసీ జెండా ఎగురవేయాలని పిలుపుని చ్చారు. సమావేశంలో జేఏసీ గద్వాలజిల్లా అధ్య క్షుడు నరసింహ యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి వెం కటన్నగౌడ్‌, వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతయ్యయాదవ్‌, జితేందర్‌, నాయకులు నాగరాజు, ఈదన్న, రాఘవేంద్రగౌడ్‌, దేవర శివ, గంగాధర్‌గౌడ్‌, వసంతచారి, రామన్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:47 PM