Share News

మహాత్ముడి ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:46 PM

ప్రపంచానికి అహింసా మార్గాన్ని బోధించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నా రు.

మహాత్ముడి ఆశయ సాధనకు కృషి
మక్తల్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్‌ నాయకులు

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- జాతిపితకు ఘనంగా నివాళి

మక్తల్‌/నారాయణపేట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి అహింసా మార్గాన్ని బోధించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నా రు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మక్తల్‌ పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ అహింసాయుత మార్గాన్ని అనుసరించి మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గణేష్‌కుమార్‌, రవికుమార్‌, కట్టసురేష్‌కుమార్‌, ఆనంద్‌గౌడ్‌, నూరుద్దీన్‌, కున్సి నాగేందర్‌ తదితరులున్నారు. అదేవిధంగా, పేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి, మాట్లాడారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కోనంగేరి హన్మంతు, డైరెక్టర్‌ శరణప్ప, తహర్‌హుసేన్‌, సంగు, కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:46 PM