ప్రజా ఫిర్యాదులపై సత్వర పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:24 PM
వివి ధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేస్తున్నార ని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

గద్వాలక్రైం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వివి ధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేస్తున్నార ని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది ఫిర్యాదులు రాగా, నేరుగా ఫి ర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలకు సంబంఽధిం చి 2, అన్నదమ్ముల గొడవలకు సంబంధించి 1, భర్త వేధింపులకు సంబంధించి 1, ఇతర అంశాలకు సం బంధించి 4 ఫిర్యాదులు అందాయని తెలిపారు. సమస్యల సత్వర పరిష్కారానికి తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మేడికొండలో స్టేషన్ ఏర్పాటుకు వినతి
అయిజ మండలంలోని పెద్దగ్రామమైన మేడికొండలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం ఎస్పీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశా రు. దీనికి ఎస్పీ స్పందిస్తూ ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వినతిపత్రాన్ని అందించిన వారితో మేడికొండ ఈశ్వర్, మేడికొండ కృష్ణగౌడు, పాల్వాయి లక్ష్మినారాయణ, బుచ్చన్న రఘు ఉన్నారు.