Share News

దాతలు ముందుకు రావాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:20 PM

పాఠశాలల అఽభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే జీ మధుసూదర్‌రెడ్డి అన్నారు.

దాతలు ముందుకు రావాలి
విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి

మూసాపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల అఽభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే జీ మధుసూదర్‌రెడ్డి అన్నారు. పాఠశాలలో అదనపు గది హాలుకు దాతలు ముందుకొచ్చి ధాతృత్వం చాటడం గొప్పవరం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో దాత మూసాపేటకు చెందిన దివంగత గడ్డం బాలమ్మ, బాలనారాయణ జ్ఞాపకార్థం కుమారుడు గడ్డం రాజేందర్‌ రూ.10 లక్షలతో అదనపు గదిని నిర్మించగా, ప్రారంభానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత ఊరుకు కొంత అనే సహకారంతో గ్రామంలో సర్కారు బడిలో పేద విద్యార్థుల చదువులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకురావాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. అడ్డాకుల మండలం పొన్నకల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు జీఎంఆర్‌ సేవా సమితి తరపున ప్రత్యేకంగా తయారు చేసిన స్టడీ మెటీరియల్‌తో పాటు కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి ఎమ్మెల్యే పాల్గొని అందజేశారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్‌, తోట శ్రీహరి, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో అనురాధ, ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, నాయకులు గంగుల విజయమోహన్‌రెడ్డి, జగదీశ్వర్‌, బాలనర్సింహులు, సీజీ గోవర్ధన్‌, తిరుపతయ్యగౌడ్‌, గడ్డం మహేందర్‌, శరత్‌కుమార్‌రెడ్డి, కావలి నారాయణ, బోయ కృష్ణయ్య, తాజోద్దిన్‌, గోపాల్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:20 PM