Share News

పంచాయతీల పాలనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ?

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:31 PM

జిల్లాలో గ్రామపంచాయతీల పాలనపై పాలకులకు చిత్తశుద్ధి ఏది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

పంచాయతీల పాలనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ?

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

అయిజటౌన్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామపంచాయతీల పాలనపై పాలకులకు చిత్తశుద్ధి ఏది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బుధవారం అయిజలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గద్వాల జిల్లాలో పనిచేస్తున్న డీపీవో 15 రోజుల క్రితం సస్పెన్షన్‌కు గురైతే ఇప్పటివరకు ఆ స్థానంలో మరో అధికారిని నియమించక పోవ టం దారుణమన్నారు. గ్రామ పంచాయతీల పా లకవర్గాల పదవీకాలం ముగియడంతో, 14నెల లుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ పరిస్థితిలో కీలకమైన జిల్లా పంచాయతీ అధికారి పోస్ట్‌ ఖాళీగా ఉండటంతో గ్రామీణ పాలన కుంటుపడుతుందని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి పాలకులకు పంచాయతీలను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేకపోవటం వల్లే జిల్లా అధికారి నియామకంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులుకు ఎదురవు తున్న పాలనా సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి గద్వాల జిల్లాకు నూతన పంచాయతీ అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు భీంసేన్‌రావ్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు భగత్‌రెడ్డి, నాయకులు అశోక్‌, లక్ష్మన్‌గౌడు, లక్ష్మణాచారి, రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:31 PM