పనులు చేయండి.. బిల్లుల బాధ్యత నాది
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:33 PM
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

- కాంట్రాక్టర్‌లతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. పనులు ఆపొ ద్దని పూర్తి చేసిన పనులకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శు క్రవారం జిల్లా కేంద్రంలోని పురపాలిక సమావే శ మందిరంలో కాంట్రాక్టర్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్‌లతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో అను భవాలు దృష్టిలో ఉంచుకుని కొందరిలో బిల్లుల కు సంబంధించిన అపోహలు ఉండొచ్చని, ప్ర స్తుతం అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. కౌన్సిల్ గడువు ముగుస్తున్నదని, ప్రత్యేక పాలన లోనూ మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూ బ్‌నగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చేం దుకైనా సిద్దంగా ఉన్నారన్నారు. సమావేశంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ షబ్బీర్ అహ్మద్ పాల్గొన్నారు.
మహిళా సంఘాలతో సమావేశం
మెప్మా డీఎంసీ, సీవో, ఆర్‌పీలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. బ్యాంకు లింకేజీ లక్ష్యాలు, కొత్త గ్రూపులు, ఇందిరా మహిళ శక్తి యూని ట్లు, క్యాంటిన్లు, జీవన్‌ధార మెడికల్ దుకాణాల కార్యకలాపాలపై చర్చించారు.
తాగునీటి సరఫరా, మొక్కలకు నీళ్లు పట్టేందుకు ఐదు ట్రాక్టర్ ట్యాంకర్లు
పాలమూరు పురపాలికలో వన మహోత్స వం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల ను సంరక్షించేందుకు రూ.50 లక్షల మునిసిపల్ నిధులతో ఐదు ట్రాక్టర్లు, ట్యాంకర్‌లను కొను గోలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు.