Share News

ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మ పోరాటం

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:56 PM

ఎస్సీ వర్గీకరణ కోరుతు న్న మాదిగలది ధర్మ పోరాటమని, దాన్ని వ్యతిరేకిస్తున్న వారిది స్వార్థమని ఎమ్మా ర్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మ పోరాటం
నాగర్‌కర్నూల్‌ పట్టణంలో డప్పు కొడుతూ ర్యాలీ నిర్వహిస్తున్న మందకృష్ణ మాదిగ

- 7న ‘లక్ష డప్పులు- వేల గొంతులు’ ప్రదర్శనను జయప్రదం చేయండి

- ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ గద్వాల సర్కిల్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోరుతు న్న మాదిగలది ధర్మ పోరాటమని, దాన్ని వ్యతిరేకిస్తున్న వారిది స్వార్థమని ఎమ్మా ర్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న హైద రాబాదులో నిర్వహించ తలపెట్టిన మా దిగల ‘లక్ష డప్పులు వేల గొంతులు’ ప్రద ర్శనలో భాగం గురువారం నాగర్‌కర్నూ ల్‌, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డప్పుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీ నుంచి బస్టాండు కూడలి వరకు ప్రదర్శనలో మందకృష్ణ మాదిగ డప్పు కొడుతూ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మా ట్లాడుతూ వర్గీకరణకు మాలలు తప్ప ఎస్సీల్లోని 57 ఉప కులా లు అనుకూలంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కులాలు, సామాజిక సంఘాలు ఎమ్మార్పీఎస్‌ పోరాటాలకు అండగా నిలుస్తూ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ కేంద్ర అధి ష్టానంతో పాటు రాష్ట్రంలో రాజకీయంగా ఉన్నత స్థానంలో రెండు మాల కుటుంబాలు ఎస్పీ వర్గీకరణకు అడ్డుకుంటాయని ఆరో పించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సాక్షి గా స్వాగతించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా మాదిగలు రోడెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన జెట్టి ధర్మరాజు వంటి మాలలకు రాబోయే రోజుల్లో అండగా ఉంటామన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించనున్న లక్ష డప్పులు వేయి గొంతుల ప్రదర్శనలో జిల్లా నుంచి మాదిగలు, మాదిగ ఉప కులాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రాత్రి గద్వాలలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి గద్వాల పట్టణం లో ర్యాలీగా వెళ్లి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ కార్యక్రమాన్ని ఉద్దేశింది మాట్లాడారు. అంతకు ముందు మంద కృష్ణకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గద్వాలకు వచ్చిన మంద కృష్ణ బాబు జగ్జీవన్‌రావు, డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు, జైభీం దీక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు మంగి విజయ్‌, గూట విజయ్‌, కోళ్ల శివ, డప్పు కళాకారులు డప్పుస్వామి, గద్వాలలో శంకర్‌ మాదిగ, జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌మాదిగ, పరశురాముడు, భాస్కర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:56 PM