పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:09 PM
ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

- నందివాహనంపై ఊరేగిన పార్వతీపరమేశ్వరులు
- శ్రీశైలం వెళ్తూ.. మొక్కుబడుల చెల్లింపు
- కొండ దిగుతుండగా ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
అచ్చంపేటటౌన్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమామహేశ్వర క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి మ హబూబ్‌నగర్, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తు లు ఉమామహేశ్వరున్ని దర్శించుకు ని మొక్కులు తీర్చుకున్నారు. కొంత మంది భక్తులు భోగమహేశ్వరం నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భక్తులు బారులు తీ రారు. శనివారం ఉదయం స్వామివారిని నం దివాహనంపై ఊరేగింపుగా ఆలయం నుంచి పా పనాశిని గుండం వరకు తీసుకెళ్లి అక్కడ స్వామివారికి గం గాజలంతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం గర్భగుడి వరకు వేదమంత్రాలు మంగళవాయిద్యాలతో ఊ రేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు గవ్యాంత పూజలు, అమ్మవారికి అభిషేకం సహస్రనామార్చన, రుద్రాభి షేకం, రుద్రహోమం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వ హించారు. అదే విధంగా సాయంత్రం 5 గంటలకు సాయ మౌపాసన, శ్రీసూక్త, దుర్గాసూక్త హోమాలు, నం దివాహనసేవ, మృగయాత్ర వినోదం, నీరాజ నం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కొండ పైకి భారీగా భక్తులు రా వడంతో ఉమామహేశ్వర కొండపై నుంచి ఆర్టీసీ బస్సు మలుపు వద్ద దిగుతుండగా బస్సు కొండను ఢీకొని ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయ కమిటీ సభ్యులు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. బస్సులో దాదాపు 60మంది భక్తులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివా సరావు, ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. వా హనాలను కొండ దిగువన ఉన్న భోగమహేశ్వరం వద్దనే ని లిపివేశారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీం దర్ ఆధ్వరంలో ఎస్సై రమేష్ పోలీసు బందోబస్తును ఏర్పా టు చేశారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ఆర్టీసీ బస్సుల ను కొండపైకి భక్తులను చేరవేసేందుకు డీఎం ప్రసాద్ ఏర్పాటు చేశారు.