ఐక్యతతోనే అభివృద్ధి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:35 PM
ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాన్ని అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాల ని ఆర్‌సీఎస్(రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటీవ్ సొసైటీ) కమి షనర్ సురేందర్ మోహన్ ఐఏఎస్ అన్నారు.

తెలకపల్లి/ఉప్పునుంతల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాన్ని అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాల ని ఆర్‌సీఎస్(రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటీవ్ సొసైటీ) కమి షనర్ సురేందర్ మోహన్ ఐఏఎస్ అన్నారు. బుధవా రం నాగర్‌కర్నూల్ జిల్లాలో ని తెలకపల్లి ఉప్పునుంతల వ్యవసాయ సహకార సంఘ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధిని ప వర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితో సంఘం అభివృద్ది చెందిందని, భవిష్య త్తులో రైతులకు మెరుగైన సేవలు అందించా లని ఆకాంక్షించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉప్పునుంతల సొసైటీని ఆదర్శంగా నిలిపినందుకు పాలక వర్గాన్ని అభినదించారు. సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప, దీర్గకాలిక రుణాలతో పాటు ఇతర రుణాలు ఇవ్వడం, రికవరీ గురించి తెలుసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే ఆదర్శం కాదు రాబో యే రోజులలో రాష్ట్రానికి ఉప్పునుంతల సొసైటీ ఆదర్శంగా ఉండాలని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. బెస్టు సొసైటీలను తనిఖీ చేసి అక్కడ అనుసరిస్తున్న విధానాలు వెనక బడిన సొసైటీల బలోపేతానికి ఉపయోగపడుతా యన్నారు. కార్యక్రమంలో అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, డీఎం మార్కెఫెడ్ నర్సింహ్మ రావు, డిప్యూటీ మార్కెట్ డైరెక్టర్ ప్రసాద్‌రావు తదితరులు ఉన్నారు.