Share News

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:26 PM

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి నిరంతర ప్రక్రియ
హనుమాన్‌పురలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పాలమూరు పురపాలిక పరిధిలోని 12, 13, 20, 41, 38వ వార్డుల్లో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 12వ వార్డులో రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను ప్రారంభించడంతో పాటు రూ.80 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇది వరకు కాలనీలలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో పాలమూరు రూపురేఖలు మారుస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఉమర్‌పాషా, లక్ష్మీదేవమ్మ, రావుల అనంతరెడ్డి, నాయకులు రాశెద్‌ఖాన్‌, అంజద్‌అలీ, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:26 PM