బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:01 PM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూత్పూర్ మునిసిపాలిటీ అభివృద్ధి చెందిందని ఆ పార్టీ నాయకుడు మురళిధర్‌గౌడ్ అన్నారు.

భూత్పూర్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూత్పూర్ మునిసిపాలిటీ అభివృద్ధి చెందిందని ఆ పార్టీ నాయకుడు మురళిధర్‌గౌడ్ అన్నారు. శనివారం స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. మునిసిపాలిటీలోని 10 వార్డులకు కలిపి రూ.6.50 కోట్ల నిధులు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిఽధులు మంజూరు చేశారని, ఈ నిధుల కేటాయింపులో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషి చేశారన్నారు. అయితే ఈ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించకుండా కాంగ్రెస్ అడ్డు తగిలిందని ఆరోపించారు. ఈనెల 7న ఎమ్మెల్యే జీఎంఆర్ అంతా మేమే చేశాం, మునిసిపాలిటీకి మూడు ట్రాక్టర్లు మంజూరు చేశామని, రూ.6.50 కోట్ల నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పడం హాస్యాస్పద్పంగా ఉందన్నారు. మునిసిపాలిటీ నిధుల మంజూరు విషయంలో చైర్మన్ బస్వరాజుగౌడ్ చాలా కృషిచేశారని అన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అబద్దాలు చెప్పడం తగదన్నారు. మునిసిపాలిటీ పాలక మండలి పదవీ విరమణ అతి సమీపంలో ఉండడంతో అభివృద్ధి నిధులు విడుదల చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని, పదవీకాలం అయిపోగానే మేము మునిసిపాలిటీ అభివృద్ధికి నిధులు తెచ్చామంటూ కొబ్బరి కాయలు కొట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణగౌడ్, సింగిల్ విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, పట్టణ అద్యక్షుడు సురేష్‌కుమార్‌గౌడ్, గడ్డం యాదయ్య, సాదిక్ భాయ్, తిరుపతయ్యగౌడ్, రాకేష్‌గౌడ్, నర్సిములు యాదవ్ పాల్గొన్నారు.