అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:56 PM
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటావని ఎమ్మె ల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటావని ఎమ్మె ల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురు వారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండ లంలో ఆయన పర్యటించారు. జంగమా యపల్లి శివారులో కొమ్ములగట్టు లక్ష్మీ వేంకటేశ్వరస్వామికి ఆయన ప్రత్యేక పూజ లు చేశారు. వెల్టూరు గ్రామంలోని వీవర్స్ కాలనీలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామాలలో పారిశు ధ్యం లోపించకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. క్రీడల అభి వృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో స్టేడియాలను నిర్మిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. నేటియువత ఉద్యో గాలతో పాటు స్వయం ఉపాధిపై కూడా దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమం లో మార్కెట్‌యార్డు కమిటీ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటస్వామి, మాజీ సర్పంచు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.