Share News

భూముల వివరాలు పక్కాగా ఉండాలి

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:33 PM

ప్రభుత్వం అందించే రైతు భరోసా పథకానికి భూముల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారులను ఆదే శించారు. శనివారం పట్టణం లోని కొన్ని ప్రైవేట్‌ వెంచర్‌లను పరిశీలించారు

భూముల వివరాలు పక్కాగా ఉండాలి
అయిజలో ప్రైవేటు వెంచర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, అధికారులు

- కలెక్టర్‌ సంతోష్‌

అయిజ టౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అందించే రైతు భరోసా పథకానికి భూముల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారులను ఆదే శించారు. శనివారం పట్టణం లోని కొన్ని ప్రైవేట్‌ వెంచర్‌లను పరిశీలించారు. చాలా భూములను వెంచర్‌లుగా మార్చి ప్లాట్లు విక్రయించినా ఇంకా రెవెన్యూ రి కార్డుల్లో సాగుభూమిగా నమోదై ఉన్నాయని గుర్తు చేశారు. అటువంటి భూములను రెవె న్యూ అధికారులు గుర్తించి వాస్తవంగా ఉన్న సాగుభూములనే రికార్డులో నమోదు చేయాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం త హసీల్దార్‌ కార్యాలయంలో వివిధ రకాలైన భూ రికార్డులను పరిశీలించారు. రైతు భరోసా పథకానికి నాలా కన్వర్షన్‌, భూసేకరణ, లేఅవుట్‌, వ్యవసాయ యోగ్యంలేని భూములను సర్వే నెంబర్ల వారీగా నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని కిష్టాపురంలో రేషన్‌ కార్డుల దరఖాస్తుల సర్వే పరిశీలించారు. వాస్తవంగా రేషన్‌ కార్డులు లేనివారి వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించా రు. తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో వెంకటయ్య ఇతర అధికారులు ఉన్నారు.

వ్యవసాయేతర భూముల పరిశీలన

ఇటిక్యాల: రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయేతర భూములను శనివారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో తహసీల్దార్‌ నరేందర్‌ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వ్యవసాయ భూముల వివరాలు సిద్ధం చేయా లన్నారు. వ్యవసాయ అధికారి రవికుమార్‌, ఆర్‌ఐ భీంసేనరావు, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:33 PM