Share News

అక్రమంగా నిర్మించిన దుకాణాలుకూల్చివేత

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:49 PM

గద్వాల పట్టణంలోని బీరెల్లి రోడ్డు బసవన్న సర్కిల్‌ సమీపంలో మునిసిపల్‌ స్థలంలో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయా న్ని సోమవారం అధికారులు కూల్చివేశారు.

అక్రమంగా నిర్మించిన దుకాణాలుకూల్చివేత
బసవన్న సర్కిల్‌ సమీపంలోని దుకాణ సముదాయాన్ని ఎక్స్‌కవేటర్‌ సాయంతో కూల్చివేయిస్తున్న అధికారులు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : గద్వాల పట్టణంలోని బీరెల్లి రోడ్డు బసవన్న సర్కిల్‌ సమీపంలో మునిసిపల్‌ స్థలంలో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయా న్ని సోమవారం అధికారులు కూల్చివేశారు. ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలం సమీపంలోని కాలనీకి చెందిన పదిశాతం పబ్లి క్‌ స్థలం కాగా, కొందరు కబ్జా చేసి దుకాణా లు నిర్మించారు. నిర్మాణ సమయంలోనే ము నిసిపల్‌ అధికారులు హెచ్చరించినా బేఖాతరు చేస్తూ నిర్మాణం కొనసాగించారు. నోటీసు జారీ చేసిన కమిషనర్‌ ముందస్తు సమాచా రం ఇవ్వకుండానే సిబ్బందితో కలిసి వెళ్లి నిర్మాణాలను కూల్చివేయించారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన మునిసిపల్‌ కమిషనర్‌ దశ రథ్‌ పట్టణంలో పబ్లిక్‌ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థలాలను ఆక్రమించిన వారి పై తెలంగాణ పురపాలక సంఘం చట్టం- 2019 ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. బా ధ్యులకు ఆస్తి నష్టంతో పాటు శిక్ష కూడా ఉం టుందని, ఈ విషయంలో ప్రజలు మునిసి పాలిటీకి సహకరించాలన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:49 PM