ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:18 PM
జిల్లాలోని 136 ఎంపీటీసీ స్థానాలు, 13 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి సోమవారం ఓటరు జాబితాను జిల్లాలోని పరిషత్ కార్యాలయాల వద్ద ఎంపీడీవోలు ప్రకటించారు.

- పరిషత్ కార్యాలయాల వద్ద ప్రదర్శించిన ఎంపీడీవోలు
- 15న ఫైనల్ లిస్ట్
నారాయణపేట/ఊట్కూర్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 136 ఎంపీటీసీ స్థానాలు, 13 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి సోమవారం ఓటరు జాబితాను జిల్లాలోని పరిషత్ కార్యాలయాల వద్ద ఎంపీడీవోలు ప్రకటించారు. నోటీస్ బోర్డుల వద్ద ఓటర్ల జాబితాలు ఉంచారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఇప్పటికే పంచాయతీల వారీగా జాబితాను సిద్ధం చేశారు. దీనిని ప్రామాణికంగా తీసుకొని అదనంగా వచ్చిన ఓటర్ల సంఖ్యతో తు ది జాబితాను సిద్ధం చేసి ప్రకటిస్తారు. మంగళ వారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారు చేస్తారు. 11 నుంచి 13 వరకు ఫిర్యా దులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 13న రాజకీ య పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహి స్తారు. 14న అభ్యంతరాలు, సూచనల పరిశీలన, అదేరోజు కలెక్టర్ నుంచి అనుమతి పొందుతారు. 15న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. జిల్లాలో మొత్తం 695 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో మొ త్తం 3,99,048 మంది ఓటర్లు ఉం డగా అందు లో పురుషులు 1,95,475 మంది, మహిళలు 2,03,569 మంది ఉన్నారు. ఇతరులు నలుగురు ఉన్నారు. అదేవిధంగా, ఊట్కూర్ పరిషత్ కార్యాలయం వద్ద ఓటరు జాబితాను ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్, ఎంపీవో ఎల్‌ఎంఎన్.రాజు విడుదల చేశారు. సీనియర్ అసిస్టెంట్ హబీబ్, కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.