నిబంధనలు పాటించకుంటేనే ప్రమాదాలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:39 PM
ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి మానస అన్నారు.

వనపర్తి క్రైమ్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి మానస అన్నారు. శుక్ర వారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లా డుతూ డ్రైవింగ్ చేయడం, నిద్రమత్తుతోనే ఎ క్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అన్నింటిని పాటిస్తే ప్రమాదాలు జరగవని సూచించారు. అనంతరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు కూడా అవగాహన స మావేశం నిర్వహించారు. అనంతరం డ్రైవిం గ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కా ర్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్‌ఐ జలంధర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేంద్ర, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సైదు లు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.