Share News

నకిలీ ధ్రువపత్రాల సృష్టికర్త అరెస్టు

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:56 PM

నకిలీ ధ్రువపత్రాల కేసు కీలక మలుపు తిరిగింది. మిర్యాలగూడకు చెందిన ఓ ప్రైవే ట్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ ధ్రువపత్రాల సృష్టికర్త అరెస్టు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ మొగులయ్య

- మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసిన రామకృష్ణ

- 12 మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తింపు

- వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగులయ్య

గద్వాల క్రైం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : నకిలీ ధ్రువపత్రాల కేసు కీలక మలుపు తిరిగింది. మిర్యాలగూడకు చెందిన ఓ ప్రైవే ట్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి నకిలీ సర్టిఫి కెట్లను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపా రు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ ధ్రువపత్రాలతో వ్యవ సాయ శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన కేసులో ఇటీవల అచ్చంపేటకు చెందిన నరే శ్‌, నాగరాజులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడలోని సాక్షి డిగ్రీ కళాశాల మా జీ ప్రిన్సిపాల్‌ బాలకృష్ణను అరెస్ట్‌ చేసి విచా రించారు. అతడి నుంచి మరికొన్ని ధ్రువ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు పదేళ్ల క్రితం ప్రిన్సిపాల్‌గా పని చేశాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఉద్యోగా న్ని వదిలేశాడు. జల్సాలకు అలవాటు పడిన ఆయన డబ్బు సంపాదనకు అక్రమాల బా ట పట్టాడు. అందుకోసం నకిలీ ధ్రువపత్రా ల తయారీని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ పెద్దమనిషితో ఒప్పందం కుదుర్చుకొని లక్షల రూపాయలు గడించాడు. అతడు ఇప్పటివరకు 12 నకిలీ ధ్రువపత్రాలు సృష్టించగా, వాటిలో 5 సర్టిఫి కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాటిని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డీఎస్పీ తెలిపారు. బాల కృష్ణ గత పదేళ్లుగా ఎంత మందికి నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చారనే విషయంపై విచా రణ చేపడుతున్నామన్నారు. బాలకృష్ణతో పాటు నరేశ్‌, నాగరాజుల దగ్గర కొందరు ఏజెంట్లు ఉన్నారని, వారి ద్వారా నకిలీ ధ్రువపత్రాలు ఎవరెవరికి ఇచ్చారనే విష యంపై ఆరా తీస్తున్నామని చెప్పారు. వీటి ని ఎక్కువగా వ్యవసాయ శాఖలో ఉద్యోగా లకే ఉపయోగించారని తెలిపారు. అయితే బాలకృష్ణ ఏజెంట్‌ మాత్రమేనని, ఆయన వెనుక మరికొందరు కీలక పాత్ర పోషించిన ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. విలే కరుల సమావేశంలో సీఐ టంగుటూరి శ్రీను, గద్వాల పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:56 PM