Share News

కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:35 PM

పాలమూరు కార్పొరేషన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తా
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- రూ.15.67 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు కార్పొరేషన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని, మళ్లీ రూ.15.67 కోట్లతో టీఎఫ్‌ఐడీసీ నిఽధులు వార్డులకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధులకు సంబంధించిన పనులు గురువారం కార్పొరేషన్‌ పరిధిలో నాలుగు వార్డుల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోని కాలనీలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. పాలమూరు పురపాలిక నగరపాలక సంస్థగా మారిన నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మారెడ్డి, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రతీ పల్లెను అభివృద్ధి చేస్తా

హన్వాడ : ప్రతీ పల్లెను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వేపూర్‌లో రూ.15 లక్షలతో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ, కిష్టంపల్లి నుంచి జూలపల్లి వరకు రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, ఇబ్రహీంబాద్‌లో రూ.5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండల అఽధ్యక్షుడు మహేందర్‌, సుధాకర్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్న, ఎంపీడీవో యశోదమ్మ, తహసీల్దార్‌ కిష్ట్యానాయక్‌, జిల్లా కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, నాయకులు కృష్ణయ్య, నవనీత, వెంకటాద్రి, రామకృష్ణ, యాదవరెడ్డి పాల్గొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వానగుట్టలో గల రహెమానియా ఈద్గాను మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈద్గాలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఎస్టీమేషన్స్‌ సిద్ధం చేయాలని ఈద్గా కమిటీ ప్రతినిధులకు సూచించారు. మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌అహ్మద్‌, నాయకులు సాదుల్లా, అజ్మత్‌అలీ, మోయిన్‌లీ, ఇసా ఆమోది, అంజద్‌, రాషెద్‌, ఖాజాపాష, ఇబ్రాహీం ఖాద్రీ, తాహెర్‌, హఫెజ్‌ ఇద్రీస్‌, అబ్దుల్లా పాల్గొన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలోనే గ్రామ వికాసం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : ఇందిరమ్మ రాజ్యంలోనే నిరంతరం గ్రామ వికాసం జరుగుతోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ధర్మపూర్‌లో కాంగ్రెస్‌ నాయకుడు కౌకుంట్ల నర్సింహరెడ్డి సొంత నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన తాగునీటి మినరల్‌ వాటర్‌ ప్లాంటును ప్రారంభించారు. నాయకులు ప్రతాప్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గోవింద్‌ యాదవ్‌, రాజుగౌడ్‌, మల్లు అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:35 PM