Share News

మూలకు మురిపెంగా..

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:58 PM

ఉమ్మడి జిల్లా నిరుపేదలకు వరం గా ఉన్న మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో రూ. 3 కోట్ల వైద్య పరికరాలు, యంత్రాలు,

మూలకు మురిపెంగా..
మూలకు పడ్డ రూ.లక్షల విలువైన వెంటిలేటర్లు

- రూ. 3 కోట్ల యంత్రాల పరిస్థితి

- రెండేళ్లుగా మరమ్మతులకు నోచుకోని వైనం

- మరమ్మతు చేస్తే వినియోగంలోకి వైద్య యంత్రాలు, పరికరాలు

- రూ. 20 లక్షలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు

- నిధుల కోసం ఎదురుచూస్తున్న జనరల్‌ ఆసుపత్రి అధికారులు

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా నిరుపేదలకు వరం గా ఉన్న మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో రూ. 3 కోట్ల వైద్య పరికరాలు, యంత్రాలు, పనిము ట్లు మూలకు చేరాయి. గత రెండేళ్లుగా అవి మర మ్మతులకు నోచుకోవడం లేదు. వాటిని బాగు చే యించాలంటే దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఆ నిధులు లేక కోట్ల రూపాయల విలువైన యంత్రాలు పాడైపోయే స్థితికి చేరుకున్నా యి. ఇందుకోసం తమకు నిధులు కావాలని జనరల్‌ ఆసుపత్రి అధికారులు ఇటు ప్రజాప్రతినిధులకు, అ టు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు మొర పెట్టు కుంటూనే ఉన్నారు. అయినా ఎవరు కూడా స్పం దించడం లేదు. ఫలితంగా యంత్రాలు మూలకు చేరడంతో పేద ప్రజలు నాణ్యమైన వైద్యానికి దూరమవుతున్నారు.

యంత్రాలు మూలకు...

జనరల్‌ ఆసుపత్రికి అత్యవసర పరిస్థితి కోవిడ్‌ సమయంలోనే కాకుండా ఇతర సమయాలలో కూ డా కొన్ని కోట్ల విలువైన యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే రోగుల తాకిడి ఎక్కు వగా ఉండటం, వాటి వినియోగానికి మించి వాడ టంతో కొన్ని మూలకు పడ్డాయి. అందులో ప్రధానం గా వెంటిలేటర్లు, సిపాప్‌ మిషన్లు. ప్రస్తుతం 30 వెంటిలేటర్లు, 40 సిపాప్‌ మిషన్లు మూలకు పడి ఉన్నాయి. అదేవిధంగా ఒకటి 400 ఎంఏ ఎక్స్‌రే యంత్రం, 8 ఎలక్ట్రిక్‌ ఓటి టేబుళ్లు, 8 గైనిక్‌ ఓటి టే బుళ్లు, 25 ఐసీయూ పడకలు, సర్జికల్‌ మైక్రోస్కోప్‌, బీపీ ఆపరేటర్లు, 3 అలా్ట్రసౌండ్‌ మిషన్లు ఉన్నాయి. వీటి ఖరీదు బయటి మార్కెట్‌లో దాదాపు రూ. 3 కోట్లకు పైనే ఉం టుందని జనరల్‌ ఆసుపత్రి అధి కారులు చెబుతున్నారు.

రూ. 20 లక్షలతో ప్రతిపాదనలు...

ఆసుపత్రిలో కాంటాప్ట్‌ కింద వేసిన వైద్య పరి కరాలను బయటకు తీసి బయోమెడికల్‌ ఇంజనీ రింగ్‌ అధికారులతో ప్రతిపాదనలు తయారు చే యించారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి, ప్ర జాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు పంపించా రు. రూ. 3 కోట్ల విలువైన వైద్య పరికరాలు కేవ లం రూ. 20 లక్షలతో బాగు చేయిస్తే ప్రభుత్వా నికి రూ. 3 కోట్లు మిగులుతాయని భావించి ఈ ప్రతిపాదనలు రూపొందించారు. అయితే కొన్ని చిన్న చిన్న పరికరాలను ఆసుపత్రి అభివృద్ధి కమి టీ నిధులతో బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు.

మరమ్మతులేవీ?

జనరల్‌ ఆసుపత్రికి వచ్చిన ఈ మిషన్లు ఎక్కువ గా వాడటంతో అవి పనిచేయకుండా ఉన్నాయి. అ యితే గత రెండేళ్ల క్రితం ఉన్న బయోమెడికల్‌ ఇం జనీర్లు వాటిని మరమ్మతులు చేయించకుండా ప క్కన పెట్టేశారు. దీంతో అవి మూలకు చేరాయి. వా స్తవానికి అవి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వాటిని స్ర్కాప్‌ కిందకు వేశారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయకుండా సూపరింటెండెంట్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ వాటిని మరమ్మతులు చేయించే అవకాశం ఉందని గుర్తించారు. బయోమెడికల్‌ ఇంజనీర్‌తో పాటు సర్వీస్‌ కాంట్రాక్టరుతో వాటిని చెక్‌ చేయించారు. దీంతో అవి బాగు చేయిస్తే వినియోగంలోకి వస్తాయని చెప్పడంతో అన్నింటిని బయటకు తీయించారు.

వినియోగంలోకి వస్తే ఎంతో మేలు...

మూలకు పడ్డ యంత్రాలలో ప్రధానమైనవి వెం టిలేటర్లు 30. సి పాప్‌ మిషన్లు 40 వరకు ఉన్నా యి. వాటిని బాగు చేయిస్తే ఐసీయూతో పాటు ఇ తర వార్డుల్లో కూడా వెంటిలేటర్‌ సౌకర్యాన్ని కల్పిం చే అవకాశం ఉంది. దీంతో పాటు 400 ఎంఏ సా మర్థ్యం గల ఎక్స్‌రే మిషన్‌ను బాగుచేయిస్తే రోజుకు వందల ఎక్స్‌రేలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీని వలన రోగులకు వేగవంతంగా వైద్యసేవలు అందించవచ్చు. అదేవిధంగా ఆపరేషన్‌ థియేటర్‌లో ఉండే ఎలక్ట్రిక్‌ ఓటీ టేబుళ్లు బాగుచేయిస్తే గైనిక్‌తో పాటు జనరల్‌ సర్జరీలు కూడా రోజుకు వందల్లో చేయవచ్చు. సర్జికల్‌ మైక్రోస్కోప్‌తో కూడా ఎన్నో ఈఎన్‌టీ సర్జరీలు చేయవచ్చు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి నిధులు మంజూరు చేస్తే పేద ప్రజలకు మేలు జరిగే అవకాశం లేకపోలేదు.

ప్రతిపాదనలు పంపించాం...

జనరల్‌ ఆసుపత్రిలో చాలా కాలంగా కొన్ని యంత్రాలు పనిచేయడం లేదని మూలకు పారవేశారు. వాటికి మరమ్మతులు చేయించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఇందుకోసం రూ. 20 లక్షల వరకు అవసరం ఉంటుంది. ఈ మేరకు నిధులు అవసరమని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు ఇస్తారనే నమ్మకం ఉంది. అన్ని యంత్రాలను మరమ్మతులు చేయించి సేవల్లో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం.

-డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Feb 26 , 2025 | 11:58 PM