Share News

Corn Plant:18 అడుగులు పెరిగిన మొక్క జొన్న మొక్క

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:34 PM

సాధారణంగా మొక్క జొన్న మొక్క అయిదారడుగులు మాత్రమే పెరుగుతుంది. కానీ ఈ జొన్న మొక్క మాత్రం 18 అడుగులు ఎత్తు పెరిగింది.

Corn Plant:18 అడుగులు పెరిగిన మొక్క జొన్న మొక్క
Corn Plant

నాగర్ కర్నూలు, ఆగస్టు 29: సాధారణంగా మొక్క జొన్న మొక్క అయిదారడుగులు మాత్రమే పెరుగుతుంది. కానీ ఈ జొన్న మొక్క మాత్రం 18 అడుగులు ఎత్తు పెరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని చుక్కాయిపల్లి కాలనీలో రిటైర్డ్ టీచర్ రాజేందర్ ఇంటి ఆవరణలో ఈ మొక్క జొన్న మొక్క పెరిగింది. ఆయన ఇంటి ఆవరణలో రెండు నెలల క్రితం మొక్క జొన్నలను చెరిగారు. ఆ సమయంలో మొక్క జొన్న గింజలు కింద పడి.. ఇలా మొక్క జొన్న మొక్క మొలకెత్తిందని తెలిపారు. మామూలుగా పంట పొలాలలో ఇంత పెద్దగా మొక్క జొన్న మొక్క పెరగడం చూడలేదని చెప్పారు.


ఇప్పటికే ఈ మొక్క 18 అడుగులు పెరిగిందని.. ఇది ఇంకా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ మొక్క జొన్న మొక్క 18 అడుగులు పెరగడంపై కొల్లాపూర్ వ్యవసాయ అధికారి హుస్సేనయ్య స్పందించారు. సారవంతమైన మట్టితో పాటు ఈ మొక్క ఒంటరిగా ఉండడం కూడా ఒక కారణమని తెలిపారు. అంతేకాకుండా.. భూమిలోని పోషకాలు పుష్కలంగా తీసుకోవడంతో ఇంతలా పెరిగిందన్నారు. ఈ మొక్క మరింత పెరగవచ్చునని ఆయన తెలిపారు.

Updated Date - Aug 29 , 2025 | 08:02 PM