నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:28 PM
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, రానున్న నాలుగేళ్లలో కొడంగల్ రూపు రేఖలు మారుస్తామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.

- నూతన మండలాల్లో సమీకృత కార్యాలయాలకు రూ.8 కోట్లు మంజూరు
- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
కోస్గి/మద్దూర్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, రానున్న నాలుగేళ్లలో కొడంగల్ రూపు రేఖలు మారుస్తామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం నూతనంగా ఏర్పాటైన గుం డుమాల్ మండలంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అలాగే, కొత్తపల్లిలో పరిషత్ కార్యా లయాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గుండుమాల్‌లో సమీకృత కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.ఎనిమిది కోట్ల 80 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో గుండుమాల్ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామ న్నారు. అంతకుముందు కోస్గి పట్టణంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అరబిందో సంస్థ ముందుకు వచ్చిందని, సుమారు రూ.రెండు కోట్లతో ఈ తరగతి గదులు నిర్మించనుందన్నారు. తరగతి గదుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశా రు. కాడా అధికారి వెంకట్‌రెడ్డి, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ చైర్మన్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డిప్యూటీ సీఈవో జ్యోతి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, తహసీల్దార్లు జయరాములు, భాస్కరస్వామి, పీఆర్ ఏఈ అంజిరెడ్డి, గుండుమాల్ ప్రత్యేకాధికారి ఆనంద్‌కిశోర్, మాజీ ఎంపీపీ మధుకర్‌రావ్, పార్టీ మండల అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. అంతకుముందు కొత్తపల్లిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబీకులకు అందించారు.