హామీలు విస్మరించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:45 PM
ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
- కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ నాయకుల నిరసన
- మండల కేంద్రాల్లో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేత
మక్తల్/నారాయణపేట/ఊట్కూర్/కోస్గి రూరల్/మరికల్/దామరగిద్ద, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 420 రోజులు.. 420 మో సాలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి రావాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి, నిరసన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని హామీ ఇచ్చిన కాం గ్రెస్ ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు పర్చలేదన్నారు. మోసపూరిత మాటలతో పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలంతా స్థానిక ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ రాజేష్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అన్వర్‌హుసేన్, జయానంద్, మన్నాన్, రామలింగం, సుధాకర్‌రెడ్డి, మారుతిగౌడ్, అశోక్‌గౌడ్, మొగిలప్ప తదితరులున్నారు.
అదేవిధంగా, నారాయణపేట గాంధీనగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి బీఆర్‌ఎస్ నాయ కులు వినతిపత్రం సమర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, గురులింగం, సుతారి రాంరెడ్డి, దేవరాజ్, శ్రీను, రఘు, చంద్రశేఖర్, ఫిరోజ్, ఇమ్రాన్, రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, కృష్ణ, బోయ లక్ష్మణ్, రాజు, సుభాన్‌రెడ్డి, బండి మల్‌రెడ్డి, హన్మంతు, సిద్దిలింగప్ప తదితరులున్నారు.
ఊట్కూర్‌లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన అనంతరం జడ్పీటీసీ మాజీ సభ్యుడు అరవింద్‌కుమార్ మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేలా కాం గ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్గించాలని గాందీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. నాయకులు చింతన్‌పల్లి ఆనంద్, ఎం.తరుణ్, కోరం శివ, ఆసీఫ్, రహీం, షానవాజ్ , ఖాలిక్, వడ్ల మోనప్ప తదితరులున్నారు.
కోస్గి మండలంలోని ముశ్రీఫా గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. కోస్గి పట్టణంలోని రామాలయం చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రాన్ని అందించారు. నాయకులు వెంకట్‌నర్సిములు, సాయిలు, రాజశేఖర్‌రెడ్డి, మాధవరెడ్డి, అనంతయ్య, సాయప్ప, బాల్‌రాజ్, వెంకట్‌రాములు తదితరులున్నారు.
మరికల్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కందూరు సత్యనారాయణశెట్టి, వాణిజ్య సంఘం అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్‌ఎస్ నాయకులు గాంధీ విగ్రహంపై పూలమాల వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేలా కను విప్పు కల్గించాలని పార్టీ మండల అధ్యక్షుడు లం బడి తిరుపతయ్య వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఇందిరాగాంఽధీ చౌరస్తా ో కేక్ కట్ చేశారు. పట్టణ అధ్యక్షుడు సూరిటి చంద్రశేఖర్, రవికుమార్, ప్రకాష్, ఉసేన్, విష్ణువర్ధన్‌రెడ్డి, భీమన్న తదితరులున్నారు.
దామరగిద్ద మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో బీఆర్‌ఎస్ నాయకులు గాంధీ చిత్ర పటానికి వినతిపత్రం సమర్పించి, ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుభాష్ మాట్లాడారు. మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, నర్సప్ప, దామోదర్‌రెడ్డి, భీమయ్యగౌడ్, తిప్పన్న, చంద్రకాంత్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.