Share News

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:27 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోం దని బీఆర్‌ఎస్‌ పేట మండల అధ్యక్షుడు వేపూరి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డిలు మండిపడ్డారు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌
పేటలో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- బీఆర్‌ఎస్‌ మండిపాటు

- రైతు భరోసా తగ్గింపుపై నిరసన

- పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

నారాయణపేట/మరికల్‌/ధన్వాడ/కొత్తపల్లి/ఊట్కూర్‌/దామరగిద్ద, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోం దని బీఆర్‌ఎస్‌ పేట మండల అధ్యక్షుడు వేపూరి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డిలు మండిపడ్డారు. సోమవారం నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్ధేశించి వారు మాట్లాడారు. రాష్ట్రం అప్పుల పాలైందని అబద్దాలు చెప్పి తప్పించుకునేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం లేదని ఆరోపిం చారు. రైతు భరోసా రూ.15 వేలు ఇచ్చేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కన్న జగదీష్‌, సుదర్శన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సురేందర్‌, రాము, వెంకటేష్‌, మల్లేష్‌, దేవరాజ్‌, రాంరెడ్డి తదితరులున్నారు.

అదేవిధంగా, మరికల్‌ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గంటపాటు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు రేవంత్‌రెడ్డి రైతులను నమ్మించి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ఎకరాకు రూ.15 వేలు రైతు భరో సా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రస్తుతం రూ.12 వేలకు కుదించి రైతులను నట్టేటా ముంచారన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రామస్వామి, రవి కుమార్‌, బసంతు, నారాయణ, హుసేన్‌, హన్మంతు, అనంతరెడ్డి తదితరులున్నారు.

ధన్వాడలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ సిం ధూజకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు సుధీర్‌కుమార్‌, గౌని శ్రీనివా సులు, టైలర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, జుట్ల సత్యనారాయణగౌడ్‌, చాకలి చంద్రశేఖర్‌, నాసర్‌, శివారెడ్డి, వడ్ల శాంతికువర్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లిలో కాంగ్రెస్‌ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్‌ ఎస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో దాదాపు గంట పాటు నిర్వహించిన రాస్తారోకోతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్ర మంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాంరెడ్డి, శివారెడ్డి, తెలుగు సాయిలు, రవీందర్‌రెడ్డి, రాజారెడ్డి, రఫీ, నరసింహ, మన్నెప్ప తదితరులున్నారు.

ఊట్కూర్‌ మండలం నిడుగుర్తి గ్రామంలో రైతు భరోసాను రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రైతు సంఘం మండల నాయకులు శంకర్‌, ఉప్పరి శాంతప్ప, కురువ బుగ్గప్ప, తోక శంకరప్ప, ఉగ్ర నరసింహ, మోహన్‌, గ్రామ రైతులు పాల్గొన్నారు.

దామరగిద్దలో బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలిపారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుభాష్‌, మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, నర్సప్ప, భీమయ్యగౌడ్‌, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:27 PM