కలెక్టరేట్‌లో పాముల కలకలం
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:26 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఉదయం రస్సెల్స్ వైపర్(రక్తపింజరి)పాములు కలకలం రేపాయి.

కందనూలు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఉదయం రస్సెల్స్ వైపర్(రక్తపింజరి)పాములు కలకలం రేపాయి. భవన ప్రాంగణంలో పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన మొక్కల మధ్య రెండు పాముల ను గుర్తించి కలెక్టర్ కార్యాలయ సిబ్బంది స్నేక్‌క్యాచర్ తెప్ప వంశీకి సమాచారమిచ్చారు. స్టిక్‌తో అక్కడికి చేరుకుని పాములు పట్టుకు న్నాడు. అప్పటి వరకు అందరూ కొండచిలువలుగా భావించిన అవి రస్సెల్స్ వైపర్ అనే జాతికి చెందిన విషపూరితమైన పాములుగా స్నేక్ క్యాచర్ తెలిపారు. అనంతరం పట్టుకున్న పాములను ప్లాస్టిక్ డబ్బాలలో బంధించి సురక్షితంగా బుద్దారం గండి అడవిలో వదిలి పెట్టారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం లో రస్సెల్స్ వైపర్ జాతికి చెందిన పాములు మనుగడ సాధిస్తున్నా యన్నారు. ఇవి అనేక ప్రాంతాల్లో నిత్యం కన్పిస్తున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్టుకున్న రెండు పా ములు మగ, ఆడదిగా ఆయన వివరించారు. మేటింగ్ సమయంలో ఈ పాములు కలిసి ఉంటాయని వివరిం చాడు. మరొకటి ఇదే జాతికి చెందిన పామును హౌసింగ్‌బోర్డు కాల నీ వద్ద గల రవితేజ పాఠశాల వెనక భాగంలో శరత్‌బాబు అనే వ్య క్తి ఇంట్లో కూడా పట్టుకున్నట్లు వంశీ తెలిపాడు. నాగర్‌కర్నూల్ పట్ట ణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇలాంటి పాములు కన్పి స్తే వాటికి హాని కలిగించకుండా తమకు సమాచారమందిస్తే వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జ రుగుతుందని వంశీ వివరించారు.
- వంశీని అభినందించిన కలెక్టర్
కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రెండు విషపూరితమైన పాము లను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టిన తెప్ప వంశీని కలెక్టర్ బదావత్ సంతోష్ తన ఛాంబర్‌లో అభినందించారు. ఆయన తో పాటు అమ్రాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసి స్టెంట్‌గా పని చేస్తున్న సుమన్ కూడా స్నేక్ క్యాచర్‌గా అనేక పా ములు పట్టుకున్నట్లు వంశీ తెలిపారు. మహమ్మద్, మాసూమ్ తది తరులు పాల్గొన్నారు.