గ్రామసభలో గందరగోళం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:03 AM
ప్రభుత్వ సం క్షేమ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపి క కోసం బుధవారం అమర చింతలో ఏర్పాటు చేసిన గ్రామసభలో గందరగోళం నెలకొన్నది.
- అనర్హుల పేర్లను తొలగించాలని ఆందోళన
అమరచింత, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ సం క్షేమ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపి క కోసం బుధవారం అమర చింతలో ఏర్పాటు చేసిన గ్రామసభలో గందరగోళం నెలకొన్నది. పట్టణంలోని ఐ దో వార్డులో వార్డు స్పెషల్ అధికారులు మునిస్వామి రే షన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి పేర్లను చదివి వినిపించారు. దీంతో గ్రామసభకు వచ్చిన వివిధ పార్టీల నాయకులు, కాలనీ ప్రజలు మీరు చదివిన లిస్టులో తప్పులు ఉన్నాయని అధికారులతో వాదనకు దిగారు. దీంతో గ్రామసభ గందరగోళం మధ్య సాగింది. వామపక్ష పార్టీలతో పాటు 5వ వార్డుకు సంబంధించిన మహిళలు, లబ్ధిదారులు అర్హులు లేని లిస్టును రద్దు చేసి మళ్లీ ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్యనే ఆమోదం తెలుపు తూ తీర్మానం చేశారు. కొంతమంది సంతకాలు చేయగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్, మరికొంత మంది సంతకం చేయకుండానే వెళ్లిపోయారు. ఎనిమిదో వార్డు సభలో గందరగోళం నెల కొంది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులను ఎంపిక చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి.