Share News

న్యాయాధికారిపై దాడికి ఖండన

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:17 PM

రంగారెడ్డి జిల్లా మహిళా న్యాయాధికారిపై ఓ ముద్దాయి చెప్పు విసిరి దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం నారాయణపేట, కోస్గి కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

న్యాయాధికారిపై దాడికి ఖండన
పేటలో కోర్టు నుంచి బయటికి వస్తున్న న్యాయవాదులు

- పేట, కోస్గిలలో విధులకు దూరంగా న్యాయవాదులు

నారాయణపేట/కోస్గి రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహిళా న్యాయాధికారిపై ఓ ముద్దాయి చెప్పు విసిరి దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం నారాయణపేట, కోస్గి కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. పేటలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, నేడు ఏకంగా ఓ న్యాయాధికారిపైనే దాడి జరిగిందన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీ సుకురావాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు నందునామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, న్యాయవాదులు సీతారామారావు, లక్ష్మీపతిగౌడ్‌, ఆకుల బాలప్ప, భీంరెడ్డి, విజయ్‌భాస్కర్‌, కుర్మన్నగౌడ్‌, కాళేశ్వర్‌, ప్రవీణ్‌నామాజీ, వినోద్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు. కోస్గిలో విధులు బహిష్కరించిన న్యాయవాదుల్లో శకనప్ప, సంతోష్‌నాయక్‌, రాజలింగం, తాజ్‌ఖాన్‌, రాజురెడ్డి, రమేష్‌, ఫర్హిన్‌బేగం తదితరులున్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:17 PM