ముఖ్యమంత్రి మాస్క్‌లతో ఆందోళన
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:14 PM
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరసన కార్యక్రమం రోజుకో తీరులో ఆందోళన చేపడుతున్నారు.

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరసన కార్యక్రమం రోజుకో తీరులో ఆందోళన చేపడుతున్నారు. సోమవారంతో వీరి ఆందోళన 28వ రోజుకు చేరగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీ కోదండరామ్ మాస్క్‌లను ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ .పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నందున వెంటనే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు యాదగిరి, ఇక్రం, ఖాజమైనోద్దిన్, నాగలక్ష్మి, సమంత, మమత, బాల్‌రాజ్, అనసూయ, సునీత, జ్యోతి, డేవిడ్, హర్షవరఽ్ధన్, గంగమ్మ, ఇందిర పాల్గొన్నారు