నేరాల కట్టడికి సమగ్ర చర్యలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:05 AM
నేరాల కట్టడికి సమగ్ర చర్య లు తీసుకోవాలని డీజీపీ జితేందర్ ఆదేశిం చారు.

- రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలను నివారించాలి
- సమీక్ష సమావేశంలో డీజీపీ జితేందర్
మహబూబ్‌నగర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : నేరాల కట్టడికి సమగ్ర చర్య లు తీసుకోవాలని డీజీపీ జితేందర్ ఆదేశిం చారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివా రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వ హించారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాసేవల పరంగా పోలీసుల విధులను మరింత మెరుగుపరచడం తది తర అంశాలపై చర్చించారు. ప్రజలతో సంబంధాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. నేరాల పరిశోధనను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే మరింత మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. పోలీసుశాఖను మరింత పారదర్శకంగా మా ర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమైన కేసుల వివరాలు, వాటి పురోగోతి, నేరాల నివారణకు చేపట్టిన చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలో ఎదుర వుతున్న సవాళ్లు తదితర అంశాలపై సుదీ ర్ఘంగా సమీక్షించారు. అనంతరం కార్యాల యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నేరాల పరిస్థితి, స్థితిగతులు, పరిష్కారానికి చేపట్టిన చర్యలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై మహబూబ్‌నగర్, నారాయణపేట ఎస్పీలు జానకి, యోగేష్‌గౌతమ్‌లు పవర్ పాయింట్ ప్రజంటే షన్ ద్వారా వివరించారు. రెండు జిల్లాల్లో ప్రత్యేక సవాళ్లు, పరిష్కార మార్గాలు, పోలీ సు బలగాలు ప్రదర్శించిన తీరు, వారి ప్రతి భలను ప్రస్తావించారు.
పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలను అందించారు. మహ బూబ్‌నగర్ జిల్లాకు సంబందించి రాంరెడ్డి, బాలచంద్రుడు, రాధాకృష్ణ, రఘు, అబ్దుల్ గఫార్, మల్లిఖార్జున్, నారాయణపేట జిల్లాకు చెందిన అందె వెంకటేశ్వర్లు, రవీందర్‌నాథ్, నాగరాజులు ప్రశంసాపత్రాలను అందుకు న్నారు. కార్యక్రమంలో మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ, డీఐటీ ఎల్‌ఎస్ చౌహన్, అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐలు, ఆర్‌ఐలు, నారాయణపేట అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీ లింగయ్య, సీఐలు పాల్గొన్నారు.