‘వసతి గృహాల్లో కామన్ డైట్ అమలు చేయాలి’
ABN , Publish Date - Jan 22 , 2025 | 11:46 PM
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్, కాస్మోటిక్ చార్జీలను భారీగా పెంచిందని, వసతిగృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
వనపర్తి రూరల్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్, కాస్మోటిక్ చార్జీలను భారీగా పెంచిందని, వసతిగృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సీ నియర్ మహిళా ఐఏఎస్ అధికారులు బాలి కల వసతిగృహాల్లో బస చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం చేసిన సూచన మేరకు వనపర్తి జి ల్లాకు ప్రత్యేక అధికారిగా మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా బుధవా రం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలి కల వసతి గృహాన్ని సందర్శించారు. ముందు గా ఐడీవోసీకి వచ్చిన అధికారిణికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అ దనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు స్వాగ తం పలికారు. గిరిజన బాలికల సంక్షేమ వ సతి గృహంలో కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నారా లేదా అని ప్రిన్సిపాల్‌ను ఆరా తీశారు.