రాష్ట్రస్థాయి విజేతలుగా తిరిగిరావాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:05 AM
రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ కబడ్డీ జిల్లా జ ట్టు మంచి ఆటతీరును కనబరచి విజేతలుగా తిరిగిరావాలని బీజేపీ సీనియర్ నాయకుడు బండల వెంకట్రాములు అన్నారు.

బీజేపీ నాయకుడు బండల వెంకట్రాములు
గద్వాల అర్బన్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ కబడ్డీ జిల్లా జ ట్టు మంచి ఆటతీరును కనబరచి విజేతలుగా తిరిగిరావాలని బీజేపీ సీనియర్ నాయకుడు బండల వెంకట్రాములు అన్నారు. పట్టణంలోని నల్లకుంట వాల్మీకి భవనంలో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ ఆదివారం వరకు నిర్వ హించిన క్యాంప్ ముగింపు సమావేశానికి ఆయ న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫిబ్రవ రి 4వ తేదీ నుంచి 7వరకు ఆదిలాబాద్ జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాస్ఫూ ర్తిని ప్రదర్శించి జిల్లా మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కబడ్డీ నరసింహ, ఉపాధ్యక్షుడు కరెం ట్ నరసింహ, ఫిజికల్ డైరెక్టర్లు కృష్ణయ్య, రాజేందర్, ట్రెజరర్ చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.రవి, జిమ్‌పాషా, వెంకటన్న, బుజ్జిబాబు, శివ శంకర్, క్రీడాకారులు ఉన్నారు.