Share News

చైనామాంజా విక్రయించినా, కొన్నా చర్యలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:41 PM

జిల్లా పరిధిలో చైనామాంజాపై నిషేధం ఉంద ని, ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం ప్రకటనలో హెచ్చరించారు.

చైనామాంజా విక్రయించినా, కొన్నా చర్యలు

దుకాణాల్లో తనిఖీలు చేపడతాం

ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో చైనామాంజాపై నిషేధం ఉంద ని, ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం ప్రకటనలో హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజ విక్రయించే దుకాణాలపై తనిఖీలు చేపడతామని తెలిపారు. నైలాన్‌, సింఽథటిక్‌ దారాలతో తయారు చేసే చైనామంజా వల్ల ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో ఎన్నో పక్షులు, సాధారణ ప్రజలు, గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడా ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అమ్మిన వారికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా ఉంటుందని తెలిపారు. విక్రయిస్తున్న వారిపై డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Updated Date - Jan 06 , 2025 | 11:41 PM