ప్రారంభమైన చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:48 PM
గద్వాల కోటలో వెలసిన సంస్థానాధీశుల ఇలవేల్పు భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

- గద్వాల సంస్థానాధీశుల ఇలవేల్పు
- తొలిరోజు శేషవాహనంపై ఊరేగిన స్వామివారు
గద్వాల టౌన్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): గద్వాల కోటలో వెలసిన సంస్థానాధీశుల ఇలవేల్పు భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్స వాల ప్రారంభం సందర్భంగా మూలవిరాట్‌కు నిత్య విశేష ఫలపంచామృతాభిషేకం, అనంతరం పుష్పాలంక రణ పూర్తి చేశారు. సాయంత్రం 5.30 గంటలకు పు ణ్యాహవచనం, అంకురార్పణం, దేవతా ఆహ్వానం, దీక్షావస్త్రం, కలశస్థాపన, గోపూజ అనంతరం ధ్వజారోహణ పూర్తిచేసి ధనధాన్య పూజలను శాస్ర్తోక్తంగా నిర్వహిం చారు. కోట ఆలయంలో ధ్వజస్తంభానికి ఆలయ వి చారణకర్త దిన్నె ప్రభాకర్‌రావు దంపతులు ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం భూలక్షీ, శ్రీదేవి సమేత చెన్నకేశవస్వా మి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాకారంలో శేష వాహనంపై ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను పురస్క రించుకుని రాత్రి భక్తిగీతాలు, మహామంగళ హారతి చే పట్టారు. గద్వాల రా ఘవేంద్ర మఠం మేనేజర్ స్వామిరాయ, అర్చ కులు, భక్తులు పాల్గొన్నారు.