జోగుళాంబ ఆలయంలో చండీహోమాలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:42 PM
ఐదో శక్తిపీఠం జోగుళాంబ బా లబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్వర్యం లో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణ మండపంలో ఘనంగా చండీ హోమాలు, వార్షిక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు.

అలంపూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అలంపూరు ఐదో శక్తిపీఠం జోగుళాంబ బా లబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్వర్యం లో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణ మండపంలో ఘనంగా చండీ హోమాలు, వార్షిక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, సంవత్సరానికి ఒక సా రి నిర్వహించే జోగుళాంబ అమ్మవారికి వార్షి క బ్రహ్మోత్సవాలలో భాగంగా వెయ్యి కలశాలతో సహస్ర కలశాభిషేకం, పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. చండీ హోమం దగ్గ ర భక్తుల చేత పూజలు చేయించారు.