Share News

రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం చట్టం చేయాలి

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:49 PM

దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపుపై చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం చట్టం చేయాలి
సభలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- సగరుల డిమాండ్ల పరిష్కారానికి కృషి : ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి

- అణగారిన వర్గాల ప్రభుత్వాలు రావాలి: ఎంపీ ఈటల రాజేందర్‌

- నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో సగర శంఖారావ సభ

నాగర్‌కర్నూల్‌టౌన్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపుపై చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌సాగర్‌ అధ్యక్షతన నిర్వహించిన సగర శంఖారావ సభ కు మంత్రి జూపల్లితో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రా జేందర్‌, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లా డుతూ సగరుల న్యాయమైన డిమాండ్ల పరిష్కా రానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ అణ గారిన వర్గాల సమస్యలు పరిష్కరించే వ్యక్తులు, ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సమస్త సంపదను అందరికి సమానంగా పంచా లనే అంబేడ్కర్‌ చెప్పినట్లుగా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రాజ్యం, రాజ్యాంగం ఎప్పు డూ పేదలకు అవసరం ఉంటుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బీసీలలో ఐక్యత లేనంత కాలం ఏ పార్టీ ఆశించిన స్థాయి లో పదవులు, టికెట్లు ఇవ్వవన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన వారికి అండగా నిలుస్తామని, మోసం చేస్తే మాత్రం ఊరుకోబో మని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకు ళా భరణం కృష్ణమోహన్‌, సగర వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ మారుతీసాగర్‌ వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:49 PM