Share News

మందా జగన్నాథ్‌కు ప్రముఖుల నివాళి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:36 PM

మాజీ పా ర్లమెంటు సభ్యులు డాక్టర్‌ మందా జగన్నాథ్‌ మృతి చెందడంతో పలువురు ప్రముఖులు నివా ళి అర్పించారు.

మందా జగన్నాథ్‌కు ప్రముఖుల నివాళి

గద్వాల, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మాజీ పా ర్లమెంటు సభ్యులు డాక్టర్‌ మందా జగన్నాథ్‌ మృతి చెందడంతో పలువురు ప్రముఖులు నివా ళి అర్పించారు. గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అదేవిధంగా మాజీమంత్రి డీకే సమరసింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నా లుగుసార్లు ఎంపీగా ఆయన నాగర్‌కర్నూల్‌ పా ర్లమెంటు, ముఖ్యంగా నడిగడ్డ ప్రాంత అభివృ ద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.

Updated Date - Jan 12 , 2025 | 11:37 PM