మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి ప్రముఖుల హాజరు
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:30 PM
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రెండవ కుమారుడు చిట్టెం పృథ్వీరెడ్డి వివాహానికి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు నియోజక వర్గం నుంచి పెద్దఎత్తున నాయకులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు.

మక్తల్‌రూరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రెండవ కుమారుడు చిట్టెం పృథ్వీరెడ్డి వివాహానికి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు నియోజక వర్గం నుంచి పెద్దఎత్తున నాయకులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు లక్ష్మారెడ్డి, కొండయ్య, చంద్రకాంత్‌గౌడ్, మాదిరెడ్డి జలం ధర్‌రెడ్డి, ఆశిరెడ్డి, వర్కటం జగన్నాథ్‌రెడ్డి, నేరడుగమ్ము పీఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి, నంది దేవేందర్‌రెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నరసింహగౌడ్, రాజేష్‌గౌడ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.