Share News

గృహప్రవేశం రోజే ఇంట్లో చోరీ

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:32 PM

మం డలంలోని తల్పునూర్‌లో బాలమ్మ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన చోటుచేసుకుంది.

గృహప్రవేశం రోజే ఇంట్లో చోరీ

రేవల్లి, పిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని తల్పునూర్‌లో బాలమ్మ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ రా ము తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్ర వారం రాత్రి బాలమ్మ ఇంట్లోకి దొంగ చొరబడి రెండు స్మార్ట్‌ ఫోన్‌లను చోరీ చేశాడు. చోరీ చేసి పారిపోతుండగా.. బాలమ్మ తన కుమారుడైన శి వను నిద్రలేపగా.. అతను దొంగను వెంబడించా డు. అదే గ్రామానికి చెందిన అభిమన్యు రెడ్డిగా గుర్తించాడు. అప్పగి దొంగ పరారయ్యాడు. దీం తో బాలమ్మ అభిమన్యు రెడ్డి పై చర్యలు తీసుకో వాలని శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే సింది. ఈ మేరకు ఎస్‌ఐ రాము కేసు నమోదు చేశారు. నూతన గృహప్రవేశమైన రాత్రే ఇలా జ రిగిందని విలపించారు. దొంగను గ్రామపెద్దల స మక్షంలో తీసుకురాగా.. చోరీ చేశానని ఒప్పుకొ న్నాడు. కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు

Updated Date - Feb 08 , 2025 | 11:32 PM