‘పది’ విద్యార్థులకు అల్పాహారం
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:45 PM
పరీక్షలకు సిద్ధం అవు తున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రభు త్వం అల్పాహారం అందించనున్నది.

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం
- 21,894 మందికి ప్రయోజనం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : పరీక్షలకు సిద్ధం అవు తున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రభు త్వం అల్పాహారం అందించనున్నది. ప్రభు త్వ పాఠఽశాలల్లో పదవ తరగతి చదువుతు న్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహి స్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు కొనసాగుతు న్నాయి. విద్యార్థులు ఉదయం వేళ ఇంట్లో టిఫిన్ చేసి ప్రత్యేక తరగతులకు వస్తారు. మధ్యాహ్నం పాఠశాలలోనే భోజనం చేస్తా రు. కానీ సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే దూర ప్రాంత విద్యార్థులు ఆకలి తో ఇబ్బంది పడుతున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం విద్యార్థులకు అల్పా హారం అందించాలని నిర్ణయించింది. ఈ నెల ఒకటి నుంచి మార్చి 20వ తేదీ వరకు అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉత్తర్యులు జారీ చేశారు.
ప్రతీ విద్యార్థికి రోజుకు రూ. 15
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 533 ప్రభుత్వ పాఠశాలల్లో 21,894 మంది పదవ తరగతి చదువుతున్నారు. వారికి గత ఏడాది నవంబరు మొదటి వారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించేం దుకు ప్రతీ విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పు న 38 రోజులకు రూ. 570 రూపాయలు ఖర్చు చేయనున్నారు. అందుకోసం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిధులు కేటాయిం చారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నిధులతో పాటు ప్రతీ విద్యార్థికి రోజుకు ఐదు రూపాయలు అదనంగా కేటాయిస్తు న్నారు. అందుకోసం కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి 24 రోజులకు సంబంధించి రూ. 7.5 లక్షలు విడుదల చేశారు. మొత్తంగా విద్యార్థికి రూ. 20 చొప్పున ఖర్చు చేసి అల్పాహారం ఇవ్వనున్నారు. ఎస్‌ఎంసీల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉడి కించిన శెనగలు, పల్లీలు, పెసర్లు, ఉల్లిపాయ పకోడి, మిల్లెట్ బిస్కెట్లు, బెల్లం పట్టీలు అందించనున్నారు.