‘పది’ విద్యార్థులకు అల్పాహారం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:10 PM
పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

- 7.5 లక్షల నిధులు మంజూరు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖ ఉదయం, సాయంత్రం గంట పాటు పది విద్యార్థులకు గత డిసెంబరు మొదటి వారం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కూడా ఈ తరగతులు వందశాతం హాజరువుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచే వచ్చే విద్యార్థులు ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకుంటుండగా, అర్థకాలితో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ విద్యార్థులకు అల్ఫాహరం అందించేందుకు ప్రతీ విద్యార్థికి అల్పాహరం కోసం రోజుకు రూ.ఐదు చొప్పున మంజూరు చేసింది. దీంతో జిల్లాలో మొత్తం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు 60 వేలకు పైగా ఉన్నారు. వీరికి ప్రతీ రోజూ అల్పాహం ఇచ్చేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేయగా, పని దినాల్లో ఈ నిధులు వాడుకొని విద్యార్థులకు అల్పాహారం ఇస్తారు.
విధిగా అల్పాహారం అందించాలి
ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులందరికీ విధిగా అల్పాహారం అందించాలి. ప్రతీ విద్యార్థిపై సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక తరగతులకు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలి.
- ప్రవీణ్‌కుమార్, డీఈవో